మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఘనత.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే తొలి బౌలర్‌గా | Mitchell Starc create nerecord Fewest balls taken to 50 wickets in World Cup | Sakshi
Sakshi News home page

World Cup 2023: మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఘనత.. వరల్డ్‌కప్‌ చరిత్రలోనే తొలి బౌలర్‌గా

Published Sun, Oct 8 2023 7:20 PM | Last Updated on Mon, Oct 9 2023 10:46 AM

Mitchell Starc create nerecord Fewest balls taken to 50 wickets in World Cup - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో 50 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ను ఔట్‌ చేసిన స్టార్క్‌ ఈ మార్క్‌కు చేరుకున్నాడు. తద్వారా మరో అరుదైన ఘనతను స్టార్క్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా స్టార్క్‌ నిలిచాడు. స్టార్క్‌ కేవలం 941 బంతుల్లోనే 50 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం లసిత్‌ మలింగ పేరిట ఉండేది. మలింగ 1187 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును స్టార్క్‌ బ్రేక్‌ చేశాడు. ఇక​ ఓవరాల్‌గా ఇప్పటివరకు 112 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్‌ 221 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: #Ducks: ఆనందం కాసేపు కూడా లేదు! నువ్వేం కెప్టెన్‌? గోల్డెన్‌ డక్‌ బాయ్‌ నువ్వేమో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement