మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 340 పరుగుల లక్ష్య చేధనలో భారత్ పోరాడుతోంది. ఆఖరి రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించగా.. రెండో సెషన్‌లో మాత్రం టీమిండియా అద్బుతంగా తిరిగి పుంజుకుంది.
యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆఖరి రోజు ఆటలో యశస్వి జైశ్వాల్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
ఏమి జరిగిందంటే?
అద్భుతంగా ఆడుతున్న జైశ్వాల్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు స్టార్క్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అసంతృప్తికి గురయ్యాడు. స్టార్క్ తన రన్ ఆప్‌ను తీసుకునేందుకు వెళ్లిన వెంటనే యశస్వి బెయిల్స్‌ను తిరిగి మార్చాడు.
దీంతో బంతి వేసిన తర్వాత జైశ్వాల్‌ను స్టార్క్ ఏదో అన్నాడు. జైశ్వాల్ కూడా అందుకు ధీటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.
క్రీజులో జైశ్వాల్(61 నాటౌట్), పంత్(22) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 236 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్‌కు 7 వికెట్లు కావాలి.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్ డ్రా కోసం ఆడుతున్నట్లు అన్పిస్తోంది.
చదవండి: IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్ అయిపో రోహిత్'..
Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C
— cricket.com.au (@cricketcomau) December 30, 2024
Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C
— cricket.com.au (@cricketcomau) December 30, 2024
Comments
Please login to add a commentAdd a comment