
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే జైశ్వాల్ పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన జైశ్వాల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో యశస్వి కంటే ముందు ఆర్చీ మాక్‌లారెన్ (ఇంగ్లండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లండ్), రోరీ బర్న్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.
ఓవరాల్‌గా ఓ టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. చివరగా జైశ్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2017లో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా జైశ్వాల్ తొలి టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. కానీ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుమైన సెంచరీతో చెలరేగాడు.
టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు వీరే..
సునీల్ గవాస్కర్, 1974 vs ఇంగ్లండ్
ఎస్ నాయక్, 1974 vs ఇంగ్లండ్
సునీల్ గవాస్కర్, 1983 vs వెస్టిండీస్
సునీల్‌గవాస్కర్, 1987 vs పాకిస్తాన్
వి రామన్, 1990 vs న్యూజిలాండ్
ఎస్ దాస్, 2002, వెస్టిండీస్
వసీం జాఫర్, 2007 vs బంగ్లాదేశ్
కేఎల్ రాహుల్, 2017 vs శ్రీలంక
చదవండి: IND vs AUS: ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్‌లో రెండు ఛాన్స్‌లు వచ్చినా! వీడియో