ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన ఆసీస్ స్టార్ పేసర్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రీమియర్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్టార్క్‌ను ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు ఓ ఆట ఆడేసికున్నారు.
ముఖ్యంగా సన్‌రైజర్స్ స్టార్ హెన్రిస్ క్లాసెన్ అయితే స్టార్క్‌ను ఊచకోత కోశాడు. ఎస్ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన స్టార్క్ ఏకంగా 26 పరుగులు సమర్పించకున్నాడు. ఆ ఓవర్‌లో మొత్తం నాలుగు సిక్స్‌లు బాదారు. అందులో క్లాసెన్ 3 సిక్స్‌లు కొట్టగా.. షబాజ్ అహ్మద్ ఓ సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ తన నాలుగు ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు.
కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రూ.24.75 కోట్ల భారీ ధరకు స్టార్క్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో దారుణ ప్రదర్శన కనబరిచిన స్టార్క్‌ను నెటిజన్లు దారుణంగా విఫలమవుతున్నారు. తన కంటే రూ.20 లక్షల తీసుకున్న హర్షిత్ రానా ఎంతో బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో రానా మూడు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఆఖరి ఓవర్‌లో అద్బుతంగా బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందిచాడు. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. హెన్రిస్ క్లాసెన్ 63 పరుగులతో విరోచిత పోరాటం చేసినప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment