అడిలైడ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ 48 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ కెరీర్‌లో అత్యుత్తమ గణంకాలు గతంలో 6/50గా ఉండేవి. స్టార్క్ తన కెరీర్‌లో మొత్తం 15 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ 350 వికెట్ల అరుదైన క్లబ్‌లో చేరాడు.
ఈ మ్యాచ్‌లో స్టార్క్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా వికెట్లు తీశాడు. స్టార్క్ ఇన్నింగ్స్ తొలి బంతికే భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇలా టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం స్టార్క్‌కు ఇది మూడో సారి. స్టార్క్‌కు ముందు విండీస్ బౌలర్ పెడ్రో కాలిన్స్ కూడా టెస్ట్‌ల్లో మూడు సార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. స్టార్క్ దెబ్బకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42), కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment