అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్‌స్వీని (38) క్రీజ్‌లో ఉన్నారు. ఉస్మాన్ ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment