Ashes 2nd Test: స్టార్క్‌ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం | Ashes 2nd Test: Australia Dominant After Bagging Massive Lead | Sakshi
Sakshi News home page

Ashes 2nd Test Australia Vs England: స్టార్క్‌ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం

Published Sat, Dec 18 2021 8:08 PM | Last Updated on Sat, Dec 18 2021 8:08 PM

Ashes 2nd Test: Australia Dominant After Bagging Massive Lead - Sakshi

Ashes 2nd Test Australia Vs England: యాషెస్‌ సిరీస్‌ 2021-22లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌(డే అండ్ నైట్ మ్యాచ్‌)లో ఆతిధ్య ఆస్ట్రేలియా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 282 ప‌రుగుల భారీ అధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్కస్ హారిస్(21), మైఖేల్ నెస‌ర్‌(2) ఉన్నారు. ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ 13 ప‌రుగులు చేసి ర‌నౌటయ్యాడు.

అంతకుముందు 2 వికెట్ల న‌ష్టానికి 17 ప‌రుగుల‌ వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను కెప్టెన్ జో రూట్‌(62; 7 ఫోర్లు), మ‌లాన్(80; 10 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 138 ప‌రుగుల భాగ‌స్వామాన్ని నెల‌కొల్పారు. అయితే, 79 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్‌ చివరి 7 వికెట్లు కోల్పోవడంతో 236 పరుగుల వద్ద ఆలౌటైంది. స్టార్క్‌(4/37), లియోన్(3/58), గ్రీన్‌(2/24) ఇంగ్లండ్‌ను తీశారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 473/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగ‌తి తెలిసిందే. తొలి టెస్ట్‌ నెగ్గిన ఆసీస్‌ 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 అధిక్యంలో ఉంది.
చదవండి: పిల్లలు పుట్టరని వ్యాక్సిన్‌ వేయించుకోవట్లేదట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement