second Test of the Ashes series
-
Ashes 2nd Test: స్టార్క్ విజృంభణ.. ఆసీస్‌కు భారీ అధిక్యం
Ashes 2nd Test Australia Vs England: యాషెస్ సిరీస్ 2021-22లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్(డే అండ్ నైట్ మ్యాచ్)లో ఆతిధ్య ఆస్ట్రేలియా పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 282 పరుగుల భారీ అధిక్యంలో కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజ్‌లో మార్కస్ హారిస్(21), మైఖేల్ నెసర్(2) ఉన్నారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 13 పరుగులు చేసి రనౌటయ్యాడు. అంతకుముందు 2 వికెట్ల నష్టానికి 17 పరుగుల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను కెప్టెన్ జో రూట్(62; 7 ఫోర్లు), మలాన్(80; 10 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామాన్ని నెలకొల్పారు. అయితే, 79 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ చివరి 7 వికెట్లు కోల్పోవడంతో 236 పరుగుల వద్ద ఆలౌటైంది. స్టార్క్(4/37), లియోన్(3/58), గ్రీన్(2/24) ఇంగ్లండ్‌ను తీశారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 473/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. తొలి టెస్ట్ నెగ్గిన ఆసీస్ 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 అధిక్యంలో ఉంది. చదవండి: పిల్లలు పుట్టరని వ్యాక్సిన్ వేయించుకోవట్లేదట..! -
రోజర్స్, స్మిత్ సెంచరీలు
ఆస్ట్రేలియా 337/1 యాషెస్ రెండో టెస్టు లార్డ్స్: యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు అద్భుత ఆరంభం లభించింది. మ్యాచ్ తొలి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 337 పరుగులు చేసింది. ఓపెనర్ క్రిస్ రోజర్స్ (282 బంతుల్లో 158 బ్యాటింగ్; 25 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (217 బంతుల్లో 129 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు వీరిద్దరు అభేద్యంగా 259 పరుగులు జోడించారు. లార్డ్స్‌లో ఆ జట్టుకు రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. రోజర్స్ కెరీర్లో ఇది ఐదో సెంచరీ కాగా, స్మిత్‌కు పదోది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా... తొలి వికెట్‌కు 15 ఓవర్లలోనే 78 పరుగులు జత చేసిన అనంతరం మొయిన్ అలీ బౌలింగ్‌లో వార్నర్ (42 బంతుల్లో 38; 7 ఫోర్లు) వెనుదిరిగాడు. ఆ తర్వాత రోజర్స్, స్మిత్ జోడి ఇంగ్లండ్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆసీస్ వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.