Mitchell Starc Break 85 Year Old Feat Enter Rarest Of Rare Ashes List - Sakshi
Sakshi News home page

Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్‌ స్టార్క్‌

Published Wed, Dec 8 2021 9:31 AM | Last Updated on Wed, Dec 8 2021 10:26 AM

Mitchell Starc Break 85 Year Old Feat Enter Rarest Of Rare Ashes List - Sakshi

Mitchell Starc Repeats 85 Years Old Record.. యాషెస్‌ సిరీస్‌ అనగానే ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాలు జూలు విదిలిస్తాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవాలని పరితపిస్తుంటాయి. తాజాగా మొదలైన యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. లంచ్‌ విరామ సమయానికే ఇంగ్లండ్‌ టాపార్డర్‌ను ఆసీస్‌ బౌలర్లు కకావికలం చేసింది. ఇక ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఫీట్‌ను రిపీట్‌ చేశాడు.

చదవండి: AUS vs ENG Ashes Series: ‘యాషెస్‌’ సమయం.. 1956 తర్వాత మళ్లీ ఇప్పుడే

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో స్టార్క్‌ తన తొలి బంతికే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ను గోల్డెన్‌డక్‌గా పెవిలియన్‌ చేర్చాడు. స్టార్క్‌ వేసిన తొలి బంతిని హిట్‌ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో​ బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ అయి ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టింది. ఇలా యాషెస్‌ చరిత్రలో ఒక ఆస్ట్రేలియన్‌ పేసర్‌ తొలి టెస్టు తొలి బంతికే వికెట్‌ తీయడం 85 ఏళ్ల తర్వాత ఇది రెండోసారి. ఇంతకముందు 1936లో ఆస్ట్రేలియా పేసర్‌ ఎర్నీ మెక్‌కార్మిక్.. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ స్టాన్‌ వర్తింగ్‌టన్‌ను తొలి బంతికే డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ రెండో సెషన్‌లో 6 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. ఓలీ పోప్‌ 36, క్రిస్‌ వోక్స్‌ 2 పరుగులతో ఆడుతున్నారు.

చదవండి: ‘శవాన్ని కాల్చేస్తారు.. బూడిదను తీసుకువెళ్తారు’.. బ్లిగ్‌ పెళ్లి.. అసలు బూడిద ఉన్న ట్రోఫీ ఎక్కడ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement