
ఐపీఎల్-2024 సీజన్ మొత్తం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్.. కీలక మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో హెడ్ డకౌటయ్యాడు.
కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో హెడ్‌ను బోల్తా కొట్టించాడు. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్ రెండో బంతిని మిడిల్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ గుడ్‌లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ బంతిని హెడ్ ఆఫ్‌సైడ్ దిశగా షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
కానీ బంతి ప్యాడ్, బ్యాట్ గ్యాప్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన హెడ్‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతేకాకుండా హెడ్ ఔట్‌కాగానే కేకేఆర్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Starc sets the tone for Qualifier 1 with a ripper! 🔥#IPLonJioCinema #TATAIPL #KKRvSRH #TATAIPLPlayoffs #IPLinBengali pic.twitter.com/3AJG5BvZwT
— JioCinema (@JioCinema) May 21, 2024