ఎస్ఆర్‌హెచ్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే | Sunrisers Hyderabad registers lowest ever score in final against Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

IPL 2024: ఎస్ఆర్‌హెచ్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే

Published Sun, May 26 2024 11:55 PM | Last Updated on Mon, May 27 2024 9:54 AM

 Sunrisers Hyderabad registers lowest ever score in final against Kolkata Knight Riders

ఐపీఎల్‌-2024 ర‌న్న‌ర‌ప్‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిలిచింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. దీంతో ముచ్చ‌ట‌గా మూడో సారి టైటిల్‌ను ముద్దాడాల‌న్న హైద‌రాబాద్ క‌ల నేరవేరలేదు. 

ఇక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్ పరంగా తీవ్ర నిరాశపరిచింది. బౌలింగ్ విషయం పక్కన పెడితే బ్యాటింగ్‌లో అయితే మ‌రింత దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్ల దాటికి ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

కనీసం ఏ ఒక్క ఆటగాడైనా జట్టు కోసం ఆడినట్లు అన్పించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ కొనసాగింది. ఈ క్రమంలో 113 పరుగులకే ఎస్‌ఆర్‌హెచ్ కుప్పకూలింది. తద్వారా ఓ చెత్త రికార్డును ఎస్ఆర్‌హెచ్ త‌మ ఖాతాలో వేసుకుంది. 

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఫైన‌ల్లో అతి త‌క్కువ స్కోర్ చేసిన జ‌ట్టుగా ఎస్ఆర్‌హెచ్ నిలిచింది. అంతకుముందు ఈ చెత్త రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట  ఉంది. సీఎస్‌కే 2013 ఫైనల్లో ముంబైపై 125 రన్స్ చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబైను ఎస్ఆర్‌హెచ్‌ను అధిగ‌మించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement