సిడ్నీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 72 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో కైవసం చేసుకుంది. 280 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 38.5 ఓవర్లలో 208 పరుగులకు కుప్పకూలింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో మిచిల్ స్టార్క్, జంపా నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీయగా.. హాజిల్ వుడ్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ బ్యాటర్లలో విన్స్(60), బట్లర్(71) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
కాగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 94 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అతడితో పాటు లాబుషేన్(58), మార్ష్(50) అర్ధసెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ మూడు, విల్లీ, వోక్స్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక నామమాత్రపు మూడో వన్డే నవంబర్ 22న మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది.
చదవండి: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. మళ్లీ అదే బ్యాడ్ న్యూస్..!
Comments
Please login to add a commentAdd a comment