ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ క్యారీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మార్ష్(59 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
అదేవిధంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. స్టీవ్ స్మిత్ (4), మ్యాక్స్‌వెల్ (7), లబుషేన్ (19) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్, బెతల్, పొట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
నిప్పులు చేరిగిన స్టార్క్..
అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (61 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు హాజిల్‌వుడ్, హార్దీ, మాక్స్‌వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇరు జట్ల మధ్య మంగళవారం(సెప్టెంబర్ 24) మూడో వన్డే జరగనుంది.
చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)
Comments
Please login to add a commentAdd a comment