ఐపీఎల్ ఈసారి కళ తప్పనుందా..? అంటే అవుననే అంటున్నాయి ఐపీఎల్ వర్గాలు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి మరో నెల సమయం మాత్రమే ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోకి పలువురు స్టార్ క్రికెటర్లు క్యాష్ రిచ్ లీగ్ బరిలో నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఇదివరకే ప్రకటన చేయగా, తాజాగా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్, ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌లు వేలంలో పాల్గొనడం అనుమానంగా మారిందని తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్‌పై దృష్టి సారించాలనే కారణంగా ఇంగ్లండ్ కెప్టెన్ రూట్.. మెగా వేలానికి దూరం అవుతున్నట్లు ప్రకటించగా.. కమిన్స్, స్టార్క్, స్టోక్స్‌లు ఇతరత్రా కారణాల చేత లీగ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
కమిన్స్ గతేడాది కేకేఆర్ తరఫున ఆల్‌రౌండర్‌గా అద్భుతంగా రాణించగా.. స్టోక్స్ చివరి ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చివరిసారిగా 2015 సీజన్‌లో ఆడాడు. ఆ ఏడాది, అంతకుముందు ఏడాది అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఐపీఎల్ నుంచి వైదొలిగిన స్టార్క్.. ఈ ఏడాది లీగ్‌కు కచ్చితంగా అందుబాటులో ఉంటానని ముందుగా ప్రకటించాడు. కానీ ప్రస్తుతం అతను.. తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సైతం ముందుగా లీగ్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించి, యాషెస్‌లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
చదవండి: కోహ్లి వారసుడి ఎంపికపై బీసీసీఐ అప్‌డేట్..!
Comments
Please login to add a commentAdd a comment