RCB Vs KKR: విరాట్ కోహ్లి విధ్వంసం.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైర‌ల్‌ | IPL 2024 RCB Vs KKR: Virat Kohli Slams Fifty To Guide RCB To 182-6 Against KKR, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2024 RCB Vs KKR: విరాట్ కోహ్లి విధ్వంసం.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో వైర‌ల్‌

Published Fri, Mar 29 2024 9:59 PM | Last Updated on Sat, Mar 30 2024 10:52 AM

Virat Kohli slams fifty to guide RCB to 182-6 against KKR  - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2024లో విరాట్ కోహ్లి సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి విధ్వంసం సృష్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి కింగ్ కోహ్లి మాత్రం అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి తన జట్టుకు మంచి స్కోర్ అందించాడు. 58 బంతులు ఎదుర్కొన్న  4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్ధానానికి చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 90.50 సగటుతో 181 పరుగులు చేశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో కోహ్లితో పాటు గ్రీన్‌(33), కార్తీక్‌(20) ప‌రుగుల‌తో రాణించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement