IPL 2022 Mega Auction: ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకుని, ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్.. తాను క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకునేందుకు గల కారణాలను తాజాగా వెల్లడించాడు. కుటుంబానికి దూరంగా 22 వారాల పాటు బయో బబుల్‌లో గడపడం తన వల్ల కాదని, అందుకే మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని వివరణ ఇచ్చాడు.
ఐపీఎల్ కంటే దేశమే తనకు ముఖ్యమని, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ ఆస్ట్రేలియాకేనని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, స్టార్క్ 2015లో చివరిసారిగా ఐపీఎల్‌లో ఆడాడు. ఆ సీజన్, అంతకుముందు సీజన్లలో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.4 కోట్లు పెట్టి దక్కించుకున్నప్పటికీ.. గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
ఆ తర్వాత వివిధ కారణాల చేత అతను ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో స్టార్క్(ఆర్సీబీ తరఫున) 27 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో స్టార్క్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 5 టెస్ట్‌ల్లో 19 వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో ఈ ఆసీస్ పేసర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పలు ఐపీఎల్ జట్లు ప్లాన్ చేశాయి. అయితే, ఆఖరి నిమిషం వరకు అతను వేలంలో పేరు నమోదు చేసుకోకపోవడంతో మిన్నకుండిపోయాయి.
చదవండి: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్
Comments
Please login to add a commentAdd a comment