Australia bowlers
-
అందుకే ఐపీఎల్లో ఆడకూడదని డిసైడయ్యా.. ఆసీస్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2022 Mega Auction: ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొనాలని ముందుగా నిర్ణయించుకుని, ఆఖరి నిమిషంలో మనసు మార్చుకున్న ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్.. తాను క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకునేందుకు గల కారణాలను తాజాగా వెల్లడించాడు. కుటుంబానికి దూరంగా 22 వారాల పాటు బయో బబుల్‌లో గడపడం తన వల్ల కాదని, అందుకే మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకోలేదని వివరణ ఇచ్చాడు. ఐపీఎల్ కంటే దేశమే తనకు ముఖ్యమని, ఫస్ట్ ప్రయారిటీ ఎప్పటికీ ఆస్ట్రేలియాకేనని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా, స్టార్క్ 2015లో చివరిసారిగా ఐపీఎల్లో ఆడాడు. ఆ సీజన్, అంతకుముందు సీజన్లలో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018లో అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 9.4 కోట్లు పెట్టి దక్కించుకున్నప్పటికీ.. గాయం కారణంగా ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత వివిధ కారణాల చేత అతను ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్లో స్టార్క్(ఆర్సీబీ తరఫున) 27 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో స్టార్క్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 5 టెస్ట్‌ల్లో 19 వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరిచాడు. దీంతో ఈ ఆసీస్ పేసర్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పలు ఐపీఎల్ జట్లు ప్లాన్ చేశాయి. అయితే, ఆఖరి నిమిషం వరకు అతను వేలంలో పేరు నమోదు చేసుకోకపోవడంతో మిన్నకుండిపోయాయి. చదవండి: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ -
అడిలైడ్ టెస్ట్ మ్యాచ్.. చిక్కుల్లో భారత్
అడిలైడ్ : ఆస్ట్రేలియాలో ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తడబడింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), విరాట్ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25)లు పెవిలియన్‌కు చేరారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్ శర్మ-రిషబ్ పంత్‌లు కాసేపు మరమ్మత్తులు చేశారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్, నాథన్ లియాన్లు తలో రెండు వికెట్లు సాధించగా, స్టార్క్, కమిన్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.టీ విరామానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 143 పరుగులతో ఉంది. పుజారా(46) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కంగారూ బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో టీమిండియా త్వరగా వికెట్లు నష్టపోయింది. 15 పరుగులకే ఓపెనర్లు రాహుల్, విజయ్ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. టెస్ట్ స్పెషలిస్ట్ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్ విడదీశాడు. కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు. ఆపై కాసేపటికి రిషబ్ పంత్‌ను కూడా లియాన్ ఔట్ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు. -
ఇంగ్లండ్ తడబాటు
తొలి ఇన్నింగ్స్ 85/4 ఆసీస్ 566/8 డిక్లేర్డ్ స్మిత్ డబుల్ సెంచరీ లార్డ్స్: యాషెస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు తడబడుతోంది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో కుక్ సేన 29 ఓవర్లలో నాలుగు వికెట్లకు 85 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు ఇంకా 481 పరుగులు వెనుకబడి ఉంది. తమ ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రారంభమైన వికెట్ల పతనం 30 పరుగులకే నాలుగు వికెట్లు పడేదాకా సాగింది. అయితే ఈ దశలో జట్టును స్టోక్స్ (50 బంతుల్లో 38 బ్యాటింగ్; 5 ఫోర్లు; 1 సిక్స్), కెప్టెన్ కుక్ (85 బంతుల్లో 21 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఆదుకున్నారు. జాన్సన్‌కు రెండు వికెట్లు పడ్డాయి. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 149 ఓవర్లలో 8 వికెట్లకు 566 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (346 బంతుల్లో 215; 25 ఫోర్లు, 1 సిక్స్) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. రోజర్స్ (300 బంతుల్లో 173; 28 ఫోర్లు) కీలక పాత్ర పోషించాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 284 పరుగుల భారీ భాగస్వామ్యం ఏర్పడింది. ఇదే క్రమంలో తను కెరీర్లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. బ్రాడ్‌కు నాలుగు, రూట్‌కు రెండు వికెట్లు దక్కాయి.