
స్టార్క్- కమిన్స్ (PC: CA)
ఐపీఎల్-2024 వేలానికి సమయం ఆసన్నమైన తరుణంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం(డిసెంబరు 19)నాటి వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయే ఆటగాళ్లు వీరేనంటూ తన అంచనాలు తెలియజేశాడు. అయితే, ఈ వేలంలో హాట్‌కేక్‌గా మారతాడనుకున్న వన్డే వరల్డ్‌కప్-2023 హీరో ట్రవిస్ హెడ్ విషయంలో మాత్రం అశ్విన్ ట్విస్ట్ ఇవ్వడం విశేషం.
అశ్విన్ అంచనా ప్రకారం.. దుబాయ్ వేదికగా జరుగునున్న క్యాష్ రిచ్ లీగ్ వేలంలో తమిళనాడు బ్యాటింగ్ ఆల్‌రౌండర్ షారుఖ్ ఖాన్ 10 -14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్-2023లో సెంచరీలతో విరుచుకుపడిన రచిన్ రవీంద్రకి రూ. 4- 7 కోట్ల మేర దక్కే అవకాశం ఉంది.
ఇక టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్, వెస్టిండీస్ బ్యాటర్ రోవ్‌మన్ పావెల్, సౌతాఫ్రికా బౌలర్ గెరాల్డ్ కోయెట్జీలు రూ. 7- 10 కోట్ల మేర ధర పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రవిస్ హెడ్ రేంజ్ మాత్రం రూ. 2- 4 కోట్ల మధ్యే ఉంటుందని అశ్విన్ అంచనా వేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఐపీఎల్-2024 వేలంలో రూ. 4- 7 కోట్లకు అమ్ముడుపోగలడని అశ్విన్ పేర్కొన్నాడు. అదేవిధంగా.. ఆస్ట్రేలియా స్టార్ పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మాత్రం రూ. 14 కోట్ల మార్కును దాటగలరని అశూ పేర్కొనడం విశేషం.
సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు తన అంచనాలు తెలియజేసిన అశ్విన్.. క్రికెట్ షాట్ల రూపంలో ఎవరు ఎంత ధర పలికే అవకాశం ఉందని తెలియజేయడం మరో విశేషం. డిఫెన్స్ షాట్(రూ. 2-4 కోట్ల మధ్య), డ్రైవ్(రూ. 4-7), పుల్‌షాట్(రూ. 7- 10 కోట్లు), స్లాగ్(రూ. 10-14 కోట్లు), హెలికాప్టర్ షాట్(14+ కోట్లకు పైగా) అంటూ అశ్విన్ వివిధ రేంజ్‌ల మధ్య ఉంటారనుకున్న ప్లేయర్ల పేర్లను ఇలా షాట్లతో పోల్చి వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై లుక్కేయండి!
Comments
Please login to add a commentAdd a comment