దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనాలో ఇవాళ (డిసెంబర్ 19) జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌కు ఊహకందని ధర దక్కిన విషయం తెలిసిందే. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర.
స్టార్క్‌కు ఇంతటి ధర లభించకముందు ఇదే వేలంలో అతని సహచరుడు, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఇలాంటి ధరనే లభించింది. కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది.
ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. 2024 సీజన్‌లో స్టార్క్, కమిన్స్‌లకు లభించబోయే మొత్తం ఐపీఎల్ విజేత ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్ విజేతకు 20 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇది స్టార్క్, కమిన్స్‌లకు వ్యక్తిగతంగా లభించే మొత్తం కంటే తక్కువ. ఐపీఎల్ విన్నర్, రన్నరప్‌లకు లభించే మొత్తం కలుపుకుంటే కూడా స్టార్క్, కమిన్స్‌లకు లభించే మొత్తంతో సరితూగదు. ఐపీఎల్ రన్నరప్‌కు లభించే 13 కోట్లు, విజేతకు లభించే 20 కోట్లు కలుపుకుంటే 33 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ఆసీస్ బౌలింగ్ ద్వయానికి లభించే మొత్తంతో పోల్చుకుంటే ఇంకా 11.75 కోట్లు తక్కువ. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment