బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియా ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ పర్యటనకు రానుంది. ఈ సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఆసీస్ సిరీస్ చాలా కీలకం.
ఈ సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తే ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది. మరోవైపు దక్షిణాఫ్రికాపై 2-0 తేడాతో టెస్టు సిరీస్ విజయం సాధించిన ఆస్ట్రేలియా తమ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.
తొలి టెస్టుకు మిచెల్ స్టార్క్ దూరం..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో తొలి టెస్టుకు ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమయ్యే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో స్టార్క్ చేతి వేలికి గాయమైంది. ఈ క్రమంలో అతడు ఇంకా కోలుకోలేదు.
అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫిబ్రవరి 9నుంచి నాగ్‌పూర్ వేదికగా భారత్‌తో జరగనున్న తొలి టెస్టుకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా టీమిండియాతో టెస్టు సిరీస్‌కు జనవరి 19 న జట్టు ప్రకటించే అవకాశం ఉంది.
చదవండి: రిచర్డ్స్, సచిన్, కోహ్లి, రోహిత్! కానీ ఇలాంటి బ్యాటర్ శతాబ్దానికొక్కడే! సూర్యను ఆకాశానికెత్తిన దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment