
ఐపీఎల్-2024 వేలంలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచిల్ స్టార్క్ రికార్డులకెక్కాడు. స్టార్క్‌ను రూ.24.70 కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ తీవ్రంగా పోటీ పడ్డాయి.
ఆఖరికి గుజరాత్ టైటాన్స్ టైటాన్స్ వెనక్కి తగ్గడంతో కేకేఆర్ సొంతం చేసుకుంది. కాగా ఇదే వేలంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు స్టార్క్ డీల్‌తో కమ్మిన్స్ రికార్డు బద్దలైంది. కాగా స్టార్క్ ఐపీఎల్‌లో చివరగా 2015 సీజన్‌లో ఆర్సీబీ తరపున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్‌క్లాస్ పేసర్లలో స్టార్క్ ఒకడు. ఇటీవల భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ స్టార్క్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.