ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉంచేలా ఉంది. 123/4 స్కోర్ వద్ద నాలుగో ఆటను ప్రారంభించిన ఆసీస్.. ఆదిలోనే లబూషేన్ (41) వికెట్ కోల్పోయినప్పటికీ 300 పరుగుల లీడ్‌ను సాధించింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి లబూషేన్ ఔటయ్యాడు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమీని ఔట్ చేయడంతో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లు కలిపి) 600 వికెట్లు పడగొట్టిన 24వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసీస్ తరఫున షేన్ వార్న్ (999), మెక్‌గ్రాత్ (948), బ్రెట్ లీ (718) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ స్పిన్నర్ మురళీథరన్ (1347) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్, జేమ్స్ ఆండర్సన్ (972), అనిల్ కుంబ్లే (956), మెక్‌గ్రాత్ టాప్=5లో ఉన్నారు. భారత బౌలర్లలో కుంబ్లే, హర్భజన్ (711), అశ్విన్ (697), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610) స్టార్క్ కంటే ముందున్నారు.
స్కోర్ వివరాలు..
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 469 ఆలౌట్ (హెడ్ 163, స్మిత్ 121, సిరాజ్ 4/108)
- భారత్ తొలి ఇన్నింగ్స్: 296 ఆలౌట్ (రహానే 89, ఠాకూర్ 51, కమిన్స్ 3/83)
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 138/5 (లబూషేన్ 41, జడేజా 2/25)
ఆసీస్ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది
చదవండి: విధ్వంసం సృష్టించిన కర్రన్ బ్రదర్స్.. సిక్సర్ల సునామీ
Comments
Please login to add a commentAdd a comment