యాషెస్ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు.
మిస్‌ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం..
ఛేదనలో మొయిన్ అలీని వన్‌డౌన్‌లో దింపి ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం మిస్‌ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది.
రూట్‌ను వదలని కమిన్స్..
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్‌ను వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్‌ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్‌గా చూస్తే..రూట్ తన కెరీర్‌లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment