PC: CA
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టులో 303 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఓపెనర్లు వార్నర్, ఖవాజా, స్మిత్ పూర్తిగా నిరాశపరిచారు. ఇక ట్రవిస్ హెడ్ మరోసారి సెంచరీతో చెలరేగగా.. కామెరూన్ గ్రీన్ అర్ధ సెంచరీతో రాణించాడు. లబుషేన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆతిథ్య జట్టు మంచి స్కోరు నమోదు చేయగలిగింది.
ఈ క్రమంలో రెండో రోజు ఆటలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రోరీ బర్న్స్ డకౌట్ కాగా... జాక్ క్రాలే మరోసారి విఫలమయ్యాడు. ఇక ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను నెత్తికెత్తుకున్న డేవిడ్ మలన్, కెప్టెన్ జో రూట్‌లను ఆసీస్ సారథి పాట్ కమిన్స్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. 22వ ఓవర్ నాలుగో బంతికి మలన్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా.. ఆ తర్వాతి బంతికి రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
చదవండి: Ind Vs Sa: కోహ్లికి భారీ జరిమానా విధించాలి.. నిషేధించాలి! ఐసీసీకి ఇదే నా విజ్ఞప్తి
తన క్లాస్ బౌలింగ్‌తో రూట్‌కు కమిన్స్ కోలుకోలేని షాకిచ్చాడు. అద్భుతమైన బంతికి అవుట్ అయినట్లు గుర్తించిన ఇంగ్లండ్ సారథి రివ్యూకు వెళ్లే అంశాన్ని కూడా పరిశీలించకుండానే మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో చేసింది. ‘‘కెప్టెన్‌ను అవుట్ చేసిన కెప్టెన్’’ అంటూ పంచుకున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
చదవండి: Ashes 2021- 22: 134.1 స్పీడ్.. బొక్కబోర్లా పడ్డాడు.. ఇంత వరకు ఇలా అవుటవడం చూడలే!.. వీడియో వైరల్
Captain gets captain!
— cricket.com.au (@cricketcomau) January 15, 2022
Pat Cummins traps Joe Root lbw and the England skipper is gone! #Ashes pic.twitter.com/27jLfha9gK
Comments
Please login to add a commentAdd a comment