Ashes Third test
-
Ashes 3rd Test: ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు.. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఆసీస్‌పై ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (75) కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. మిచెల్ స్టార్క్ (5/78) ఫైఫర్‌తో ఇంగ్లండ్‌ను భయపెట్టినా.. వోక్స్ (32 నాటౌట్) సహకారంతో బ్రూక్ ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. బ్రూక్ ఔటయ్యాక వుడ్ (12 నాటౌట్) అండతో వోక్స్ ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించిన బ్రూక్ ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసినా ఆటగాడిగా చరిత్ర సృస్టించాడు. బ్రూక్ 1058 బంతుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని చేరుకోగా.. గతంతో ఈ రికార్డు కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ (1140) పేరిట ఉండేది. ఈ జాబితాలో గ్రాండ్‌హోమ్ తర్వాత టిమ్ సౌథీ (1167), బెన్ డకెట్ (1168) ఉన్నారు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు.. టెస్ట్‌ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు హెర్బర్ట్ సచ్లిఫ్ (12 ఇన్నింగ్స్‌లు), విండీస్ మాజీ ఎవర్టన్ వీక్స్ (12)ల పేరిట సంయుక్తంగా ఉండగా.. యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరాడు. బ్రూక్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుని, ఇంగ్లండ్/జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (13) రెండో స్థానంలో, వినోద్ కాంబ్లీ (14) మూడో స్థానంలో, లెన్ హటన్ (16), ఫ్రాంక్ వారెల్ (16), రోవ్ (16) నాలుగో స్థానంలో ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7). బ్రూక్, వోక్స్, వుడ్‌లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్‌స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
Ashes Series 3rd Test: ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7). హ్యారీ బ్రూక్ (75) అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఆఖర్లో క్రిస్ వోక్స్ (32 నాటౌట్), మార్క్ వుడ్ (16 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో రోజు ఆటలో మిచెల్ స్టార్క్ (5/78) బెదరగొట్టినా.. బ్రూక్, వోక్స్, వుడ్‌ల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. బ్రూక్, వోక్స్, వుడ్‌లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్‌స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. After losing two back to back matches, finally England beat Australia in the 3rd test to keep them alive in the ashes series.#Ashes2023 #ENGvAUS pic.twitter.com/9cEpOGcthL — Mujahid (@mujahid_bhattii) July 9, 2023 -
రూట్‌ను వదలని కమిన్స్.. స్టార్క్ దెబ్బకు పల్టీలు కొట్టిన వికెట్లు
యాషెస్ సిరీస్‌లో మూడో టెస్ట్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుంది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. లంచ్ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసి, లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉంది. హ్యారీ బ్రూక్ (40), బెన్ స్టోక్స్ (7) క్రీజ్‌లో ఉన్నారు. మిస్‌ఫైర్ అయిన మొయన్ అలీ ప్రయోగం.. ఛేదనలో మొయిన్ అలీని వన్‌డౌన్‌లో దింపి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్‌ఫైర్ అయ్యింది. అలీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్.. అలీని ఔట్ చేసిన విధానం అభిమానులను ఆకట్టుకుంది. వికెట్లు గాల్లో పల్టీలు కొట్టిన వైనం ఆసీస్ ఫ్యాన్స్‌కు కనువిందు చేసింది. రూట్‌ను వదలని కమిన్స్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (21)ను పాట్ కమిన్స్ ఫోబియా వదిలిపెట్టడం లేదు.కమిన్స్ రూట్‌ను వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో కూడా ఔట్ చేశాడు. రూట్.. ఒకే బౌలర్ చేతిలో వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో ఔట్ కావడం ఇది మూడోసారి. గతంలో అల్జరీ జోసఫ్, స్కాట్ బోలండ్.. రూట్‌ను వరుసగా మూడుసార్లు ఔట్ చేశారు. ఓవరాల్‌గా చూస్తే..రూట్ తన కెరీర్లో అత్యధిక సార్లు (11) కమిన్స్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హోరాహోరీగా సాగుతున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ హోరాహోరీగా సాగుతుంది. నాలుగో రోజు 251 పరుగుల లక్ష్యఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. తొలి సెషన్లోనే 3 వికెట్లు కోల్పోయింది. అయినా ఆ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 15 పరుగులు జోడించిన అనంతరం మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బెన్ డకెట్ (23) ఎల్బీడబ్ల్యూ కాగా.. ఆతర్వాత 60 పరుగుల వద్ద మొయిన్ అలీ (5)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు స్టార్క్. అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న జాక్ క్రాలే (44)ను 93 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ పెవిలియన్‌కు పంపాడు. మార్ష్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి క్రాలే ఔటయ్యాడు. అనంతరం మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఇంగ్లండ్.. 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగుల చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జో రూట్ (16), హ్యారీ బ్రూక్ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే మరో 131 పరుగులు అవసరం కాగా.. ఆసీస్ గెలుపుకు 7 వికెట్లు అవసరంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
టెస్ట్‌ల్లో స్టీవ్ స్మిత్‌ను మించినోడే లేడు.. బౌలర్‌గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) యాషెస్ మూడో టెస్ట్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడటం ద్వారా ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 100 టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. 2010లో లార్డ్స్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన స్మిత్.. తన కెరీర్లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడి 59.56 సగటున 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 9113 పరుగులు చేశాడు. Steve Smith is all set for his special 💯#Ashes2023 pic.twitter.com/xbcaiescXJ— CricTracker (@Cricketracker) July 6, 2023 టెస్ట్‌ల్లో స్మిత్‌ను మించినోడే లేడు.. 99 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత ప్రపంచ మేటి బ్యాటర్లను స్టీవ్ స్మిత్‌తో పోలిస్తే.. ఒక్కరు కూడా ఈ ఆసీస్ స్టార్ దరిదాపుల్లో లేరు. గణాంకాల ప్రకారం చూసినా, జట్టు విజయాల్లో పాత్ర ప్రకారం చూసినా.. స్మిత్ తిరుగులేని ఆటగాడిగా ఉన్నాడు. 99 టెస్ట్ తర్వాత స్మిత్ 9113 పరుగులు చేస్తే.. దిగ్గజ క్రికెటర్లు బ్రియాన్ లారా 8833 పరుగులు, సంగక్కర 8572 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 8492 పరుగులు, సచిన్ టెండూల్కర్ 8351 పరుగులు చేశారు. ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్‌గా చలామణి అవుతున్న విరాట్ కోహ్లి 99 టెస్ట్‌ల తర్వాత 7962 పరుగులు చేసి స్మిత్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. Most runs after 99 tests:9113 - Steven Smith (175 innings)8833 - Brian Lara (174 innings)8594 - Younis Khan (176 innings)8572 - Kumar Sangakkara (166 innings)8492 - Rahul Dravid (167 innings)— CricTracker (@Cricketracker) July 6, 2023 ఇక, ఆయా జట్ల విజయాల్లో దిగ్గజాల పాత్రతో పోలిస్తే స్మిత్ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియా విజయాల్లో స్మిత్ పాత్ర 70.41 శాతంగా ఉంటే, టీమిండియా విజయాల్లో కోహ్లి కాంట్రిబ్యూషన్ 55.34 శాతంగా ఉంది. Steve Smith's first Test - Batted No.8 & No.9, bowled 21 overs in the second innings with 3 scalps to boot!Today, he'll play his 100th Test as an all-time batting great 🙂 #Ashes #CricketTwitter pic.twitter.com/iV43G3GALZ— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023 బౌలర్‌గా మొదలుపెట్టి, ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్‌గా.. లెగ్ బ్రేక్ గూగ్లీ బౌలర్‌గా ప్రస్తానాన్ని ప్రారంభించిన స్మిత్.. ఆల్‌టైమ్ గ్రేట్ టెస్ట్ బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. గణాంకాల ప్రకారం తిరుగులేని బ్యాటర్‌గా ఉన్న స్మిత్.. తన తొలి టెస్ట్ మ్యాచ్‌లో 8,9 స్థానాల్లో బ్యాటింగ్ బరిలోకి దిగి కేవలం 13 పరుగులు (1, 12) మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన స్మిత్ బౌలింగ్‌లో రాణించి 3 వికెట్లు (సెకెండ్ ఇన్నింగ్స్‌లో) పడగొట్టాడు. స్మిత్ బౌలర్‌గా రాణించడంతో అంతా ఇతను బౌలర్‌గా స్థిరపడతారని అనుకున్నారు. అయితే స్మిత్ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ.. వరల్డ్ బెస్ట్ టెస్ట్ బ్యాటర్‌గా మారాడు. Steve Smith's peak years in Test Cricket:2014 - 1146 runs & 81.86 Average2015 - 1474 runs & 73.70 Average2016 - 1079 runs & 71.93 Average2017 - 1305 runs & 76.76 Average21 hundreds & 17 fifties from just 45 matches - The GOAT. pic.twitter.com/K0l7OvFZmE— Johns. (@CricCrazyJohns) July 5, 2023 The last time Steve Smith played a Test in Headingley, it was July 2010 & he was one Test old. Made a valiant 77, his first fifty, batting No 8 against Pakistan. Here he is on the cusp of playing his 100th Test. One of the more unique journeys to No 100 in cricket history #Ashes pic.twitter.com/4AsjldVDqW— Bharat Sundaresan (@beastieboy07) July 4, 2023 -
యాషెస్ మూడో టెస్ట్ చాలా ప్రత్యేకం.. ఆ ఇద్దరూ లేకుండా 6037 రోజుల తర్వాత..!
హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఆండర్సన్, లయోన్ లేకుండా 2006 డిసెంబర్ 26న చివరిసారిగా ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా, రెండో టెస్ట్ సందర్భంగా గాయపడినందున నాథన్ లయోన్ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్‌ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్‌ను ఇంగ్లీష్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది (మూడో టెస్ట్‌కు). ఇదిలా ఉంటే, లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
యాషెస్ సిరీస్ మూడో టెస్ట్.. భారీ మార్పులతో బరిలోకి దిగనున్న ఇంగ్లండ్..!
హెడింగ్లే వేదికగా రేపటి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తుంది. భుజం గాయం కారణంగా వైస్ కెప్టెన్ ఓలీ పోప్ జట్టుకు దూరం కాగా.. తొలి రెండు టెస్ట్‌ల్లో విఫలమైన వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ (2 టెస్ట్‌ల్లో 3 వికెట్లు) తుది జట్టులో ఉండడని సమాచారం. అలాగే రెండో టెస్ట్‌లో 5 వికెట్లతో రాణించినప్పటికీ, జోష్ టంగ్‌కు విశ్రాంతినివ్వాలని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ భావిస్తుందట. పై పేర్కొన్న ముగ్గురి స్థానాల్లో మార్క్, క్రిస్ వోక్స్, మొయిన్ అలీలను తుది జట్టులోకి తీసుకోవాలన్నది కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ మెక్కల్లమ్ ఆలోచనగా తెలుస్తుంది. మూడో టెస్ట్‌కు వేదిక అయిన హెడింగ్లే (లీడ్స్) పేసర్లకు సహకరించే అవకాశం ఉండటంతో భారీ పేస్ బౌలింగ్ అటాక్‌తో బరిలోకి దిగాలన్నది ఇంగ్లండ్ ప్రణాళికగా తెలుస్తుంది. ఈ మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేయాలని కోచ్ మెక్కల్లమ్ అనుకుంటున్నాడట. హ్యారీ బ్రూక్‌కు ప్రమోషన్ ఇచ్చి మూడో స్థానంలో బరిలోకి దించాలని ఇంగ్లండ్ యోచిస్తుందట. ఈ విషయాలను ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ద టెలిగ్రాఫ్ యాషెస్ సిరీస్‌పై తమ ప్రత్యేక కథనంలో వెల్లడించింది. కాగా, తాజాగా లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది. -
Ashes Series 3rd Test: అరుదైన మైలురాయిని చేరుకోనున్న స్టీవ్ స్మిత్
హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌తో స్మిత్ అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 40 మంది ఆటగాళ్లు 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనతను సొంతం చేసుకోగా.. ఎల్లుండి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌తో స్మిత్ వీరి సరసన చేరనున్నాడు. ఆసీస్ తరఫున ఈ మైలురాయిని గతంలో 14 మంది చేరుకోగా.. స్మిత్ 15వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కానున్నాడు. చిరకాలం గుర్తుండిపోయే తన 100వ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, మరింత స్పెషల్‌గా మార్చుకోవాలని స్మిత్ భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే, సిరీస్‌ను సైతం సొంతం చేసుకుంటుంది. స్మిత్ జట్టులోకి వచ్చాక ఆసీస్.. ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ గెలిచింది లేదు. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి చిరస్మరణీయంగా మార్చుకోవాలని స్మిత్ అనుకుంటున్నాడు. కెరీర్లో ఇప్పటివరకు 99 టెస్ట్‌లు ఆడిన స్మిత్.. 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 59.56 సగటున 9113 పరుగులు చేశాడు. తాజాగా ముగిసిన యాషెస్ రెండో టెస్ట్‌లోనూ స్మిత్ సెంచరీ చేశాడు. ప్రస్తుత తరం అత్యుత్తమ ఆటగాళ్లలో ప్రథముడిగా చలామణి అవుతున్న స్మిత్.. వంద టెస్ట్‌లోనూ సెంచరీ చేసి ఫాబ్ ఫోర్‌గా పిలువబడే కోహ్లి, రూట్, విలియమ్సన్ల కంటే చాలా స్పెషల్ అని మరోసారి నిరూపించుకోవాలని అతని అభిమానులు ఆరాటపడుతున్నారు. సెంచరీల పరంగా, యావరేజ్ పరంగా కోహ్లి (28 సెంచరీలు, 48.72 యావరేజ్), రూట్ (30, 50.43)), విలియమ్సన్ (28, 54.89)ల కంటే చాలా మెరుగ్గా ఉన్న స్మిత్.. 100వ మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఆల్‌టైమ్ గ్రేట్ అనిపించుకోవాలని వారు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే, 5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో పర్యాటక ఆస్ట్రేలియా ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ గెలవలేదు. అయినా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం తాము ఈ సిరీస్‌ను గెలిచి తీరతామని అంటున్నాడు. -
Ashes Series 2023: గెలుపు జోష్‌లో ఉన్న ఆసీస్‌కు భారీ షాక్.. ఇకపై కష్టమే..!
5 మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. రెండో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడిన (కాలు బెణికింది) వారి తురుపు ముక్క, స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ సిరీస్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారికంగా ప్రకటించింది. లయోన్ లేని లోటు ఆసీస్‌కు ఎదరుదెబ్బగా పరిగణించబడుతుంది. లయోన్ స్థానంలో సీఏ ఎవరిని కొత్తగా ఎంపిక చేయలేదు. మూడో టెస్ట్‌కు లయోన్ స్థానంలో టాడ్ మర్ఫీ తుది జట్టులో ఉంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ ప్రతిభను (4 టెస్ట్‌ల్లో 14 వికెట్లు) పరిగణలోకి తీసుకుని సీఏ అతనివైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన మర్ఫీ.. ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. ఆసీస్-ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్ట్ హెడింగ్లే వేదికగా జులై 6 నుంచి మొదలు కానుంది. కాగా, రెండో టెస్ట్, రెండో రోజు ఆటలో బెన్ డకెట్ క్యాచ్ అందుకోబోతూ నాథన్ లయోన్ కాలు బెణికింది. యాదృచ్చికంగా ఈ మ్యాచ్ లయోన్‌కు తన కెరీర్లో వరుసగా వందో టెస్ట్ మ్యాచ్. గాయపడిన అనంతరం లయోన్ బరిలోకి దిగనప్పటికీ..నాలుగో రోజు జట్టు కోసం పెద్ద సాహసమే చేశాడు. కుంటుతూనే బ్యాటింగ్‌కు వచ్చి తన జట్టుకు అతి మూల్యమైన పరుగులు సమకూర్చాడు. ఈ మ్యాచ్‌లో లయోన్ లేకపోయినా ఆసీస్ 43 పరుగుల తేడాతో గెలుపొందింది. స్టోక్స్ పోరాటం వృధా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో ఆసీస్ అంతిమంగా విజయం సాధించినప్పటికీ.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వారికి ముచ్చెమటలు పట్టించి, మూడు చెరువుల నీళ్లు తాపించాడు. వీరోచితమైన ఇన్నింగ్స్‌తో తన జట్టును గెలిపించినంత పని చేశాడు. ఆసీస్ నిర్ధేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక్కడే అద్భుతమైన పోరాటం చేశాడు. జట్టులో డకెట్్ (83) మినహా మిగతా వారెవ్వరి నుంచి సహకారం లభించకపోవడంతో ఇంగ్లండ్ 327 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. -
ఇంగ్లండ్ 305/4
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. డేవిడ్ మలాన్ (110 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీకి తోడు బెయిర్‌స్టో (75 బ్యాటింగ్; 10 ఫోర్లు), స్టోన్‌మన్ (56; 10 ఫోర్లు) పోరాడటంతో... ఇంగ్లండ్ తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఒకదశలో 89/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ 131 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఐదో వికెట్‌కు మలాన్, బెయిర్‌స్టో అబేధ్యమైన 174 పరుగులు జతచేయడంతో ఇంగ్లండ్ తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌కు రెండు, హాజల్‌వుడ్, కమిన్స్‌లకు తలో వికెట్ దక్కింది. 1966 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ తొలి రోజే 300 పరుగులు చేయడం విశేషం. స్పాట్ ఫిక్సింగ్ కలకలం మ్యాచ్‌కు ముందు స్పాట్ ఫిక్సింగ్ కథనాలతో కలకలం రేగింది. బ్రిటిష్ వార్తపత్రిక ‘ది సన్’ ఫిక్సింగ్ ఉదంతాన్ని వెలుగులోకి తేవడంతో... క్రికెట్ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఫిక్సింగ్ వార్తలను ఐసీసీ ఖండించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఏ ఓవర్లో ఎన్ని పరుగులు నమోదవుతాయి, ఎప్పుడు వికెట్ పడుతుంది, సెషన్లో ఎన్ని రన్స్ చేస్తారనే ఆంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ అజ్ఞాతవ్యక్తి సేకరించాడని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సన్ పత్రిక తన నాలుగు నెలల పరిశోధనలో తేల్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధిపతి అలెక్స్ మార్షల్ ‘బుకీలతో క్రికెటర్లు సంప్రదింపులు జరిపారనే అంశంపై ఎలాంటి ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఐసీసీ విచారణ ప్రారంభించింది. -
క్లార్క్ గుడ్‌బై
యాషెస్ ఐదో టెస్టే ఆఖరిది నాటింగ్‌హామ్ : ‘గాయాల కారణంగా నేను సరైన ఫామ్‌లో లేను. పరుగులు చేయలేకపోవడం జట్టుకు భారంగా మారింది. ఇంగ్లండ్, ఆసీస్ జట్టుకు ఉన్న తేడా ఇదే. అయితే ఆటలో గెలుపోటములు సహజం. ఈ టెస్టులో ఓడినంత మాత్రాన నేను కెరీర్‌కు గుడ్‌బై చెప్పను. నాలో క్రికెట్ ఆడే సత్తా ఉందని అనుకుంటున్నా. కాబట్టి కెరీర్‌ను కొనసాగిస్తా’ యాషెస్ మూడో టెస్టులో ఓటమి తర్వాత ఆసీస్ కెప్టెన్ క్లార్క్ మాటలివి. కానీ వారం తిరగకముందే సీన్ రివర్సయింది. నాలుగో టెస్టులో ఓటమి తర్వాత ఊహించని రీతిలో క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. యాషెస్ ఐదో టెస్టే తనకు చివరిదని తెలిపాడు. ‘ఓవల్‌లో చివరి టెస్టు ఆడతా. అందులో ఏం జరుగుతుందో చూద్దాం. బయటకు వెళ్లాలని లేదు. కానీ గత ఏడాది కాలంగా నా ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. కాబట్టి ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రే ఈ నిర్ణయానికి వచ్చా. సహచరులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీన్ని వాళ్లు ఊహించలేదు’ అని మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగంతో క్లార్క్ వ్యాఖ్యానించాడు. ఇక కామెంట్రీ బాక్స్‌లో కూర్చోవడంపై దృష్టిపెడతానని సరదాగా అన్నాడు. గాయాల బెడద...: 2011లో పాంటింగ్ వారసుడిగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన క్లార్క్.. ఆసీస్‌కు తిరుగులేని విజయాలు అందించాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా అత్యున్నత స్థాయి ఆటతీరుతో కుర్ర క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు. కెప్టెన్‌గా తొలి 30 టెస్టుల్లో 12 సెంచరీలు కొట్టిన క్లార్క్‌ను గత కొంతకాలంగా గాయాలు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. వెన్ను నొప్పి, చీలమండ గాయంతో ఓ దశలో కెరీర్ కొనసాగించడం సందిగ్ధంలో పడింది. అయితే ఎంపిక చేసిన మ్యాచ్‌ల్లోనే ఆడుతూ కొంతకాలం నెట్టుకొచ్చిన క్లార్క్.. ఈ ఏడాది ఆరంభంలో వీటికి శస్త్రచికిత్స చేయించుకుని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఫలితంగా వన్డే ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌ల్లో జట్టును ముందుండి నడిపించి టైటిల్‌నూ అందించాడు. తర్వాత వన్డేలకు, టి20లకు గుడ్‌బై చెప్పాడు. అయితే తాజా గా కాలిపిక్క కండర గాయంతో క్లార్క్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనివల్ల బ్యాటింగ్‌పై దృష్టిపెట్టలేక ఫామ్ కోల్పోయాడు. గత 30 ఇన్నింగ్స్‌లో కేవలం ఆరుసార్లు మాత్రమే 25 పరుగులు చేయడం అతని పరి స్థితికి నిదర్శనం. గత ఆరు టెస్టుల్లో అయితే కనీసం 50 పరుగులు కూడా చే యలేదు. ఓవరాల్‌గా కెరీర్లో 114 టెస్టులు ఆడిన క్లార్క్ 197 ఇన్నింగ్స్‌లో 49.30 సగటుతో 8628 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలున్నాయి. -
అండర్సన్... అదుర్స్
6 వికెట్లతో చెలరేగిన ఇంగ్లండ్ పేసర్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 136 ఆలౌట్ యాషెస్ మూడో టెస్టు బర్మింగ్‌హామ్: యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ (6/47) బంతితో నిప్పులు కురిపించాడు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి ఆస్ట్రేలియాను అద్భుతంగా కట్టడి చేశాడు. ఫలితంగా ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 36.4 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది. రోజర్స్ (89 బంతుల్లో 52; 9 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఓపెనర్ రోజర్స్ మెరుగ్గా ఆడినా.. వార్నర్ (2), స్మిత్ (7), క్లార్క్ (10) స్వల్ప వ్యవధిలో అవుట్‌కావడంతో కంగారూలు 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. అయితే రోజర్స్, వోజెస్ (16) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అండర్సన్ ఓ ఎండ్‌లో నిలకడగా వికెట్లు తీయడంతో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన క్లార్క్‌సేన 54 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. చివర్లో స్టార్క్ (11), హాజెల్‌వుడ్ (14 నాటౌట్), లియోన్ (11) పోరాడే ప్రయత్నం చేశారు. బ్రాడ్, ఫిన్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసింది. రూట్ (30 బ్యాటింగ్), బెయిర్‌స్టో (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లిథ్ (10) విఫలమైనా... బెల్ (53) నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ కుక్ (34)తో కలిసి రెండో వికెట్‌కు 57; రూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించి అవుటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 3 పరుగులు వెనుకబడి ఉంది. లియోన్ 2 వికెట్లు తీశాడు. -
ఆసీస్ అదే జోరు
పెర్త్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ మూడో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కంగారూలు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపారు. డేవిడ్ వార్నర్ (140 బంతుల్లో 112; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 3 వికెట్లకు 235 పరుగులు చేసింది. వాట్సన్ (29), స్మిత్ (5) క్రీజులో ఉన్నారు. రోజర్స్ (54), వార్నర్‌లు తొలి వికెట్‌కు 157 పరుగులు జోడించారు. రెండుసార్లు స్టంపౌట్ ప్రమాదం నుంచి బయటపడ్డ వార్నర్ కెరీర్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. క్లార్క్ (23) విఫలమయ్యాడు. బ్రెస్నన్, స్టోక్స్, స్వాన్ తలా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం ఆసీస్ 369 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 180/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 134 పరుగుల ఆధిక్యం లభించింది. కంగారూల పేస్ ధాటికి కుక్‌సేన మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ బెల్ (15), స్టోక్స్ (18), బ్రెస్నన్ (21), స్వాన్ (19 నాటౌట్) పోరాడి విఫలమయ్యారు. 61 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. హారిస్, సిడిల్ చెరో మూడు వికెట్లు తీయగా, జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. బ్రాడ్‌కు గాయం! ఇప్పటికే యాషెస్‌లో తడబడుతున్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ గాయంతో పెవిలియన్‌కు పరిమితమయ్యాడు. మూడో రోజు ఆటలో జాన్సన్ వేసిన పదునైన యార్కర్... బ్రాడ్ కుడి పాదానికి బలంగా తాకింది. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్‌కు దిగలేదు. ఇన్నింగ్స్ విరామంలో కాసేపు నెట్స్‌లో గడిపిన బ్రాడ్‌కు స్కానింగ్ నిర్వహించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చాక సోమవారం అతనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. -
ఫాలో ఆన్ తప్పించుకున్న ఇంగ్లండ్
మాంచెస్టర్: యాషెస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ ఫాలో ఆన్ తప్పించుకుంది. ఓల్ట్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గో రోజు ఆదివారం ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 139 ఓవర్లలో 368 పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయి 298 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో 70 పరుగులు చేసింది. కెవిన్ పీటర్సన్(113) చలవతో ఇంగ్లండ్ గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. చక్కటి షాట్లతో అభిమానులను అలరించిన కేపీ, స్టార్క్ బౌలింగ్‌లో అప్పర్ కట్ ద్వారా... 165 బంతుల్లో టెస్టుల్లో తన 23వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (25) తర్వాతి స్థానంలో పీటర్సన్ నిలిచాడు. అతనికి బెల్ (60) పరుగులతో తోడ్పడటంతో ఇంగ్లండ్ ఫాలో ఆన్ తప్పించుకుంది. దీంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఆసీస్ వికెట్టు నష్టానికి 24 పరుగులతో ఆడుతోంది. అంతకు ముందు ఆస్ట్రేలియా ఏడు వికెట్లు నష్టానికి 527 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.