టెస్ట్‌ల్లో స్టీవ్‌ స్మిత్‌ను మించినోడే లేడు.. బౌలర్‌గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు..! | Ashes 3rd Test: Steve Smith Has Most Runs After 99 Test Matches | Sakshi
Sakshi News home page

టెస్ట్‌ల్లో స్టీవ్‌ స్మిత్‌ను మించినోడే లేడు.. బౌలర్‌గా మొదలుపెట్టి అత్యున్నత శిఖరాలకు..!

Published Thu, Jul 6 2023 12:08 PM | Last Updated on Thu, Jul 6 2023 12:08 PM

Ashes 3rd Test: Steve Smith Has Most Runs After 99 Test Matches - Sakshi

హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) యాషెస్‌ మూడో టెస్ట్‌ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఆడటం ద్వారా ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ 100 టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. 2010లో లార్డ్స్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా టెస్ట్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన స్మిత్‌.. తన కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడి 59.56 సగటున 32 సెంచరీలు, 37 అర్ధసెంచరీల సాయంతో 9113 పరుగులు చేశాడు. 

టెస్ట్‌ల్లో స్మిత్‌ను మించినోడే లేడు..
99 టెస్ట్‌ మ్యాచ్‌ల తర్వాత ప్రపంచ మేటి బ్యాటర్లను స్టీవ్‌ స్మిత్‌తో పోలిస్తే.. ఒక్కరు కూడా ఈ ఆసీస్‌ స్టార్‌ దరిదాపుల్లో లేరు. గణాంకాల ప్రకారం చూసినా, జట్టు విజయాల్లో పాత్ర ప్రకారం చూసినా.. స్మిత్‌ తిరుగులేని ఆటగాడిగా ఉన్నాడు. 99 టెస్ట్‌ తర్వాత స్మిత్‌ 9113 పరుగులు చేస్తే.. దిగ్గజ క్రికెటర్లు బ్రియాన్‌ లారా 8833 పరుగులు, సంగక్కర 8572 పరుగులు, రాహుల్‌ ద్రవిడ్‌ 8492 పరుగులు, సచిన్‌ టెండూల్కర్‌ 8351 పరుగులు చేశారు. ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్‌గా చలామణి అవుతున్న విరాట్‌ కోహ్లి 99 టెస్ట్‌ల తర్వాత 7962 పరుగులు చేసి స్మిత్‌ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. 

ఇక, ఆయా జట్ల విజయాల్లో దిగ్గజాల పాత్రతో పోలిస్తే స్మిత్‌ రికార్డు చాలా మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియా విజయాల్లో స్మిత్‌ పాత్ర 70.41 శాతంగా ఉంటే, టీమిండియా విజయాల్లో కోహ్లి కాంట్రిబ్యూషన్‌ 55.34 శాతంగా ఉంది. 

బౌలర్‌గా మొదలుపెట్టి, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్‌గా..
లెగ్‌ బ్రేక్‌ గూగ్లీ బౌలర్‌గా ప్రస్తానాన్ని ప్రారంభించిన స్మిత్‌.. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ టెస్ట్‌ బ్యాటర్‌గా చలామణి అవుతున్నాడు. గణాంకాల ప్రకారం తిరుగులేని బ్యాటర్‌గా ఉన్న స్మిత్‌.. తన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో 8,9 స్థానాల్లో బ్యాటింగ్‌ బరిలోకి దిగి కేవలం 13 పరుగులు (1, 12) మాత్రమే చేశాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తేలిపోయిన స్మిత్‌ బౌలింగ్‌లో రాణించి 3 వికెట్లు (సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో) పడగొట్టాడు. స్మిత్‌ బౌలర్‌గా రాణించడంతో అంతా ఇతను బౌలర్‌గా స్థిరపడతారని అనుకున్నారు. అయితే స్మిత్‌ అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ.. వరల్డ్‌ బెస్ట్‌ టెస్ట్‌ బ్యాటర్‌గా మారాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement