యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొంది, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్‌లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7).
హ్యారీ బ్రూక్ (75) అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఆఖర్లో క్రిస్ వోక్స్ (32 నాటౌట్), మార్క్ వుడ్ (16 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చారు. నాలుగో రోజు ఆటలో మిచెల్ స్టార్క్ (5/78) బెదరగొట్టినా.. బ్రూక్, వోక్స్, వుడ్‌ల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు.
బ్రూక్, వోక్స్, వుడ్‌లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్‌స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
After losing two back to back matches, finally England beat Australia in the 3rd test to keep them alive in the ashes series.#Ashes2023 #ENGvAUS pic.twitter.com/9cEpOGcthL
— Mujahid (@mujahid_bhattii) July 9, 2023
Comments
Please login to add a commentAdd a comment