Ashes 3rd Test, Day 4: England 3 Down For 120, Still Need 131 Runs To Win - Sakshi
Sakshi News home page

Ashes Series 3rd Test Day 4: హోరాహోరీగా సాగుతున్న యాషెస్‌ మూడో టెస్ట్‌

Published Sun, Jul 9 2023 5:35 PM | Last Updated on Sun, Jul 9 2023 5:58 PM

Ashes 3rd Test Day 4: England 3 Down For 120, Still Need 131 Runs To Win - Sakshi

యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్ట్‌ హోరాహోరీగా సాగుతుంది. నాలుగో రోజు  251 పరుగుల లక్ష్యఛేదనలో 27/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌.. తొలి సెషన్‌లోనే 3 వికెట్లు కోల్పోయింది. అయినా ఆ జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి.  ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 15 పరుగులు జోడించిన అనంతరం మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో బెన్‌ డకెట్‌ (23) ఎల్బీడబ్ల్యూ కాగా.. ఆతర్వాత 60 పరుగుల వద్ద మొయిన్‌ అలీ (5)ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు స్టార్క్‌. అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న జాక్‌ క్రాలే (44)ను 93 పరుగుల వద్ద మిచెల్‌ మార్ష్‌ పెవిలియన్‌కు పంపాడు.

మార్ష్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ అలెక్స్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి క్రాలే ఔటయ్యాడు. అనంతరం మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్న ఇంగ్లండ్‌.. 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగుల చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. జో రూట్‌ (16), హ్యారీ​ బ్రూక్‌ (22) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 131 పరుగులు అవసరం కాగా.. ఆసీస్‌ గెలుపుకు 7 వికెట్లు అవసరంగా ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్‌ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్‌ మార్ష్‌ (118) సెంచరీ చేయగా.. మార్క్‌ వుడ్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో బెన్‌ స్టోక్స్‌ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్‌ కమిన్స్‌ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ట్రావిస్‌ హెడ్‌ (77) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్‌, వోక్స్‌ తలో 3 వికెట్లు, మార్క్‌ వుడ్‌, మొయిన్‌  అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement