టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 181 పరుగుల లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కరేబియన్ బౌలర్లకు సాల్ట్ చుక్కలు చూపించాడు.
ముఖ్యంగా విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఊచకోత కోశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన షెపర్డ్ బౌలింగ్‌లో సాల్ట్ 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా విండీస్‌పై టీ20ల్లో సాల్ట్‌కు ఘనమైన రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్‌పై బాదినవే కావడం విశేషం.
విండీస్‌పై ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ 487 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.
చదవండి: T20 WC: అఫ్గాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment