టీ20 వరల్డ్‌కప్-2024లో సూపర్ ఎయిట్ సమరానికి టీమిండియా సిద్దమైంది. సూపర్-8లో భాగంగా గురువారం బార్బడోస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్ అమీతుమీ తెల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్ దిశగా అడుగులు వేయాలని టీమిండియా భావిస్తుంటే.. అఫ్గాన్ కూడా న్యూజిలాండ్ మాదిరే భారత్‌కు కూడా షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే అఫ్గానిస్తాన్‌తో పోరుకు భారత జట్టులో ఓ కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.
బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు మెనెజ్‌మెంట్ అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు వేసి చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కుల్దీప్ ఇప్పటివరకు ఈ ఏడాది టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కుల్దీప్‌తో పాటు మరో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బెంచ్‌లో ఉన్నాడు. కానీ ఇటీవల కాలంలో చాహల్ కంటే కుల్దీప్‌నే మెరుగ్గా రాణిస్తున్నాడు. ఐపీఎల్‌లో కూడా కుల్దీప్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లోనూ యాదవ్ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టుమెనెజ్‌మెంట్ చాహల్ కంటే కుల్దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఒక్కటి మినహా జట్టులో ఇంకా ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.
అఫ్గాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment