వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం | Phil Salt slams second consecutive T20I ton after auction snub | Sakshi
Sakshi News home page

IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం

Published Wed, Dec 20 2023 10:12 AM | Last Updated on Wed, Dec 20 2023 11:16 AM

Phil Salt slams second consecutive T20I ton after auction snub - Sakshi

ఐపీఎల్‌-2024 వేలంలో ఇంగ్లండ్‌ విధ్వంసకర ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రెండు రౌండ్లలో కూడా సాల్ట్‌ను సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయిన కోపాన్ని సాల్ట్‌ వెస్టిండీస్‌పై చూపించాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సాల్ట్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌లో కరేబియన్‌ బౌలర్లను సాల్ట్‌ ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు. సాల్ట్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా సాల్ట్‌ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అలెక్స్‌ హేల్స్‌(116) పేరిట ఉండేది.

ఈ మ్యాచ్‌తో హేల్స్‌ రికార్డును సాల్ట్‌ బ్రేక్‌ చేశాడు. ఇక సాల్ట్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూసిన నెటిజన్లు.. ఫ్రాంచైజీలు అతడిని తీసుకోక తప్పు చేశాయని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా 2022, 23 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సాల్ట్‌ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన సాల్ట్‌ ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.

చదవండిIPL 2024: టెన్త్‌ క్లాస్‌తో చదువు బంద్‌.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్‌ మింజ్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement