
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏది కలిసిరావడం లేదు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నా.. బ్యాటింగ్ ఎంచుకున్నా ఫలితం మాత్రం ఢిల్లీకి ప్రతికూలంగానే ఉంటుంది. తాజాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతిని కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మిల్లర్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో సాల్ట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సాల్ట్ సీజన్‌లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్, రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు.
మరో విశేషమేంటంటే.. ఫిల్ సాల్ట్ తాను ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో బంగ్లాదేశ్‌తో ఒక అంతర్జాతీయ టి20 కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో రెండోసారి గోల్డెన్ డక్ కాగా.. తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో మూడోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరి ఇంత దారుణంగా ఆడుతున్నా అవకాశమివ్వడం ఏంటని.. ఇలాంటి ప్లేయర్ అవసరమా అని అభిమానులు పేర్కొన్నారు.
In Phil Salt's last 5 T20 inns, he's scored a golden duck every-other dig
— Mark Puttick (@GryllidaeC) May 2, 2023
0(1) ENG v BNG
5(3) DC v KKR
0(1) DC v SRH
59(35) DC v SRH
0(1) DC v GT (today)
చదవండి: చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు?
Comments
Please login to add a commentAdd a comment