వారెవ్వా సాల్ట్‌.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో వైరల్‌ | Phil Salt Takes Stunning Catch Against Lucknow Super Giants | Sakshi
Sakshi News home page

IPL 2024: వారెవ్వా సాల్ట్‌.. సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ! వీడియో వైరల్‌

Published Sun, Apr 14 2024 5:02 PM | Last Updated on Sun, Apr 14 2024 5:13 PM

Phil salt Takes stunning catch against lucknow super giants - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2024లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా లక్నో సూపర్‌ జెయిట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్‌ ఫిల్‌ సాల్ట్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సాల్ట్‌ అద్భుతమైన క్యాచ్‌తో లక్నో బ్యాటర్‌ మార్కస్‌ స్టోయినిష్‌ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌లో స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నాలుగో బంతిని గుగ్లీగా సంధించాడు.

అయితే ఆ డెలివరీని స్టోయినిష్‌ లెగ్‌ సైడ్‌ సింగిల్‌ తీయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని స్టోయినిష్‌ థై ప్యాడ్‌కు తాకి ఆనూహ్యంగా ఆఫ్‌సైడ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ సాల్ట్‌ తన కుడివైపున్‌కు జంప్‌ చేస్తూ అద్భుతమైన సింగిల్‌ హ్యాండ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు.

దీంతో స్టోయినిష్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోతుందని కామెట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మరో కేకేఆర్‌ ఆటగాడు రమణ్‌దీప్‌ సింగ్‌ సైతం సూపర్‌ క్యాచ్‌తో మెరిశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement