సొంత మైదానంలో మూడు రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్‌కు గురైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తర్వాతి మ్యాచ్‌లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యరి్థపై పైచేయి సాధించింది.
బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్‌తో తమ ఓటమికి బాట వేసుకుంది.
కోల్‌కతా: పరుగుల వరద పారుతున్న ఐపీఎల్‌లో మరో చిన్న విరామం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు స్వల్ప స్కోరుకే ఆట ముగించగా... ప్రత్యర్థి సులువుగానే లక్ష్యం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు.
ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు.
వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు
భారీ భాగస్వామ్యం...
ఛేదనలో తొలి బంతి నుంచే సాల్ట్ దూకుడు మొదలైంది. లిజాడ్ వేసిన మొదటి ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, సిక్స్ బాదగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై 15 పరుగుల వద్ద సాల్ట్ ఇచి్చన క్యాచ్‌ను లిజాడ్ వదిలేశాడు. ఖలీల్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సాల్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 79
పరుగులు సాధించింది. అయితే అక్షర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయగా, రింకూ సింగ్ (11) విఫలమయ్యాడు. అయితే ‘అయ్యర్’ ద్వయం ఇబ్బంది లేకుండా ఆడి మరో 21 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది.
స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సాల్ట్ (బి) అరోరా 13; జేక్ ఫ్రేజర్ (సి) వెంకటేశ్ (బి) స్టార్క్ 12; పొరేల్ (బి) హర్షిత్ 18; హోప్ (బి) అరోరా 6; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 27; అక్షర్ (బి) నరైన్ 15; స్టబ్స్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 4; కుశాగ్ర (సి) సాల్ట్ (బి) వరుణ్ 1; కుల్దీప్ (నాటౌట్) 35; సలామ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 8; లిజాడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–17, 2–30, 3–37, 4–68, 5–93, 6–99, 7–101, 8–111, 9–140. బౌలింగ్: స్టార్క్ 3–0–43–1, అరోరా 4–0–29–2, హర్షిత్ 4–0–28–2, నరైన్ 4–0–24–1, వరుణ్ చక్రవర్తి 4–0–16–3, రసెల్ 1–0–10–0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 68; నరైన్ (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 15; రింకూ (సి) కుల్దీప్ (బి) లిజాడ్ 11; శ్రేయస్ (నాటౌట్) 33; వెంకటేశ్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–79, 2–96, 3–100. బౌలింగ్: లిజాడ్ 3–0–38–1, ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సలామ్ 2.3–0–30–0, అక్షర్ పటేల్ 4–0–25–2, కుల్దీప్ 4–0–34–0. .
Comments
Please login to add a commentAdd a comment