
ఐపీఎల్-2024లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
కేకేఆర్ బౌలర్ల దాటికి ఢిల్లీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆఖరిలో స్పిన్నర్ కుల్దీప్ కీలక ఇన్నింగ్స్ ఆడడటంతో ఢిల్లీ.. 150 ప్లస్ మార్క్‌ను దాటగల్గింది. 26 బంతులు ఎదుర్కొన్న కుల్దీప్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో కుల్దీప్‌దే టాప్ స్కోర్ కావడం విశేషం. కెప్టెన్ పంత్ రిషబ్ పంత్ 27 పరుగులతో పర్వాలేదన్పించాడు.
ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment