సీఎస్‌కే జెర్సీలో దేశ్‌పాండే
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో దేశ్‌పాండే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. మిజోరాం బ్యాటర్లు వికాష్ కుమార్, జెహూ ఆండర్సన్, జోసెఫ్ లాల్‌థాన్‌ఖుమాను ఔట్ చేసిన దేశ్‌పాండే.. హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరాం ముంబై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది.
ముంబై బౌలర్లలో దేశ్‌పాండేతో పాటు రాయ్స్టన్ డయాస్, మోహిత్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(46 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
చదవండి: World Cup 2023: మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment