ధోని ఏం చెబితే అదే పాటించానన్న తుషార్ దేశ్‌పాండే (PC: IPL)
IPL 2023- MS Dhoni- Tushar Deshpande: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు ముంబై బౌలర్ తుషార్ దేశ్‌పాండే. పదహారో ఎడిషన్ సందర్భంగా తొలిసారి ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని పరోక్షంగా చెన్నై ఓటమికి కారణమయ్యాడు.
అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తుషార్‌కు వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, కొన్ని మ్యాచ్‌లలో సీఎస్‌కే విజయానికి దోహదం చేసినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో మరోసారి చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్.
తుషార్ దేశ్‌పాండే (PC: IPL)
ఫైనల్ మ్యాచ్‌లోనూ చెత్తగా
తన 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. కీలక మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేసి జట్టుకు భారం అనిపించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో బ్యాటర్ల మెరుపుల కారణంగా చెన్నై ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించడంతో తుషార్‌ను పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాన్స్.
అదే ఏ కాస్త తేడా జరిగినా.. అతడిని ఏకిపారేసేవారే! అదృష్టవశాత్తూ బతికిపోయాడు తుషార్. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటాడన్న అపఖ్యాతి మూటగట్టుకున్న అతడు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో తుషార్ మొత్తంగా 564 పరుగులు ఇచ్చి 9.92 ఎకానమీతో 21 వికెట్లు తీశాడు.
ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా
ఇన్ని మైనస్‌లు ఉన్నా ధోని అతడిని వెనకేసుకురావడం వల్లే తుషార్ దాదాపు ప్రతి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఈ నేపథ్యంలో ధోనిని ఉద్దేశించి తుషార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘మన రాత బాగోలేనపుడు మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి ఉంటే ఎంతో బాగుంటుంది.
ధోని భయ్యా నాకు అన్నివేళలా అండగా నిలబడ్డాడు. వైఫల్యాలు ఎదురైనపుడు ధైర్యం చెప్పాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా. ఆయన చెప్పిన మార్గంలో నడిచాను. ఆయన నన్నెపుడూ సరైన మార్గంలోనే నడిపిస్తారని నాకు తెలుసు’’ అంటూ 28 ఏళ్ల తుషార్ దేశ్‌పాండే భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా..
Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే
అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే
Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA
— Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023
Comments
Please login to add a commentAdd a comment