ప్రేయసిని పెళ్లాడిన సీఎస్‌కే స్టార్‌ బౌలర్‌.. ఫోటోలు వైరల్‌ | CSK Star Tushar Deshpande Ties The Knot With School Crush Nabha Gaddamwar, Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Tushar Deshpande Marriage: ప్రేయసిని పెళ్లాడిన సీఎస్‌కే స్టార్‌ బౌలర్‌.. ఫోటోలు వైరల్‌

Published Fri, Dec 22 2023 4:13 PM | Last Updated on Fri, Dec 22 2023 4:59 PM

CSK star Tushar Deshpande ties the knot with school crush Nabha Gaddamwar - Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే ఓ ఇంటివాడయ్యాడు. శుక్ర‌వారం త‌న చిన్న‌నాటి స్నేహితురాలు న‌భ గ‌డ్డంవ‌ర్‌ని దేశ్‌పాండే పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం​ ముంబైలోని ఓ పంక్షన్‌ హాల్‌లో ఘనంగా జరిగింది. వారి వివాహ వేడుక‌కు పలువరు క్రికెటర్లు హాజరయ్యారు. వారి వివాహ వేడుక‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను దేశ్‌పాండే ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్‌ చేశాడు.

'హృదయాల మార్పిడితో నవ జీవితానికి నాంది అంటూ’ అని క్యాప్ష‌న్ రాశాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.  ఈ కొత్త జంటకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలిపింది.  'జీవిత‌కాలంలో ప్రేమ‌, సంతోషం, అనుబంధాన్ని ఒకరికరూ పంచుకుని కలిసిమెలిసి జీవించండి. . కంగ్రాట్స్ టు సూప‌ర్ క‌పుల్ అని సీఎస్‌కే ఎక్స్‌లో రాసుకొచ్చింది.

కాగా చిన్నతనం నుంచి దేశ్‌పాండే, నభ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. స్కూల్‌డేస్‌ నుంచి మొద‌లైన‌ స్నేహం కాస్త ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారింది ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించిన ఈ జంట.. ఈ ఏడాది జూన్‌లో  ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. స్కూల్ క్ర‌ష్ నుంచి త‌న భార్య‌గా న‌భా ప్ర‌మోష‌న్ పొంద‌నుంద‌ని తుషార్‌ అప్పటిల్లో సోషల్‌ మీడియా వేదికగా తన  ఎంగేజ్‌మెంట్‌ ఫోటోను షేర్‌ చేశాడు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున దేశ్‌పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజ‌న్‌లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఫైనల్లో కూడా అదరగొట్టి చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో తుషార్ దేశ్‌పాండే త‌న వంతు పాత్ర‌ను పోషించాడు.
చదవండిటీమిండియాకు షాకులు.. స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లి?.. టెస్టులకు స్టార్‌ ఓపెనర్‌ దూరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement