PC: IPL.com
చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. సీఎస్‌కే బౌలర్లో మొయిన్ అలీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దేశ్‌పాండే రెండు వికెట్లు, శాంట్నర్ ఒక వికెట్ సాధించారు.
దేశ్‌పాండేకు క్లాస్ పీకిన ధోని..
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన తుషార్ దేశ్ పాండే అంతగా అకట్టుకోలేకపోయాడు. రెండు వికెట్లు పడగొట్టనప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 45 పరుగులిచ్చాడు. ముఖ్యంగా దేశ్‌పాండే ఎక్స్‌ట్రాస్ రూపంలో 7 పరుగులిచ్చాడు. అందులో ఏకంగా 3నోబాల్స్ ఉండడం గమనార్హం.
దేశ్‌పాండే తన వేసిన తొలి ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఈ ఓవర్‌లో రెండు నోబాల్స్, మూడు వైడ్‌లు వేశాడు. ఓవరాల్‌గా ఆ ఓవర్‌లో 18 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ అనంతరం దేశ్ పాండేకు కెప్టెన్ ఎంఎస్ ధోని క్లాస్ పీకాడు. నో బాల్స్ ఎక్కువగా వేయడంపై ఎంఎస్ కాస్త సీరియస్ అయ్యాడు. దేశ్‌పాండే తన నో బాల్స్ సమస్యను అధిగమించేందుకు మిస్టర్ కూల్ కొన్ని చిట్కాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు
MSD had a conversation with Tushar about noball, he even showed how not to bowl him. Tushar will come good for us, trust THALA 🛐. pic.twitter.com/6mH50ZIPz0
— 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) April 3, 2023
Comments
Please login to add a commentAdd a comment