
Under 19 Vice Captain Shaikh Rasheed Likely To Meet AP CMYS Jagan Mohan Reddy- విశాఖ స్పోర్ట్స్: ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు భారత క్రికెట్ అండర్–19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తెలిపారు. అహ్మదాబాద్‌లో బీసీసీఐ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న రషీద్ అక్కడి నుంచి విజయనగరం వెళుతూ గురువారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. అండర్–19 వరల్డ్ కప్‌లో చక్కగా రాణించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మరో వారంలోనే రంజీ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్ర జట్టు అంతా ఇప్పటికే తిరువనంతపురం బయలుదేరి వెళ్లింది.
అయితే తాను ప్రస్తుత రంజీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని, ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి, వారి ఆశీస్సులు తీసుకుని నేరుగా రెండో మ్యాచ్ ఆడటానికి తిరువనంతపురం వెళ్తానని రషీద్ తెలిపారు. అప్పటి వరకు విజయగనరంలోని ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు వెళ్తున్నట్లు వివరించారు. అనంతరం రషీద్ ట్యాక్సీలో విజయనగరం బయలుదేరి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment