U19 2022: ACA Reward 10 Lakhs To Shaik Rasheed, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

U 19 WC- Shaik Rasheed: షేక్‌ రషీద్‌కు 10 లక్షల నజరానా... రిషిత్‌ రెడ్డికి ఎంతంటే!

Published Mon, Feb 7 2022 10:53 AM | Last Updated on Tue, Feb 8 2022 12:32 PM

U 19 WC: ACA Reward 10 Lakhs To Shaik Rasheed HCA 10 Lakhs To Rishit Reddy - Sakshi

U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్‌: భారత జట్టు అండర్‌–19 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్‌ షేక్‌ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్‌ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్‌చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు.

మరోవైపు ప్రపంచకప్‌లో భారత జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న హైదరాబాద్‌ యువ క్రికెటర్‌ రిషిత్‌ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్‌ ప్రకటించారు. 

చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement