HCA U-16
-
షేక్ రషీద్‌కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్‌లో భారత జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
వన్డేలో డబుల్ సెంచరీ
స్కూల్ క్రికెట్లో తిలక్‌వర్మ సంచలనం సాక్షి, హైదరాబాద్ : హెచ్‌సీఏ అండర్-16 వన్డే క్రికెట్లో హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (149 బంతుల్లో 201; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో క్రిసెంట్ స్కూల్ 310 పరుగుల భారీతేడాతో ప్రిస్టన్ హైస్కూల్‌పై జయభేరి మోగించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా క్రిసెంట్ మోడల్ స్కూల్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 410 పరుగుల భారీస్కోరు చేసింది. సిద్ధార్థ్ (63), వివేక్ (52) రాణించారు. తర్వాత ప్రిస్టన్ హైస్కూల్ 100 పరుగులకే కుప్పకూలింది. శశాంక్ 5, యశ్వంత్ 4 వికెట్లు తీశారు.