వన్డేలో డబుల్ సెంచరీ
స్కూల్ క్రికెట్లో తిలక్‌వర్మ సంచలనం
సాక్షి, హైదరాబాద్ : హెచ్‌సీఏ అండర్-16 వన్డే క్రికెట్లో హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (149 బంతుల్లో 201; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో క్రిసెంట్ స్కూల్ 310 పరుగుల భారీతేడాతో ప్రిస్టన్ హైస్కూల్‌పై జయభేరి మోగించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా క్రిసెంట్ మోడల్ స్కూల్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 410 పరుగుల భారీస్కోరు చేసింది. సిద్ధార్థ్ (63), వివేక్ (52) రాణించారు. తర్వాత ప్రిస్టన్ హైస్కూల్ 100 పరుగులకే కుప్పకూలింది. శశాంక్ 5, యశ్వంత్ 4 వికెట్లు తీశారు.