సాక్షి, హైదరాబాద్: క్రీసెంట్ స్కూల్ జట్టు బ్యాట్స్మన్ ఠాకూర్ తిలక్ వర్మ (107) సెంచరీతో రాణించాడు. దీంతో ఆర్. దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నీలో భాగంగా భవన్స జూనియర్ కాలేజ్ ‘ఎ’ జట్టుతో జరిగిన మ్యాచ్లో క్రీసెంట్ స్కూల్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భవన్స జట్టు 43.3 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. రక్షణ్ రెడ్డి (56) అర్ధసెంచరీ చేయగా... ప్రమోద్ మహాజన్ (31), తరుణ్ తేజ (33) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో వివేక్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్రీసెంట్ స్కూల్ జట్టు 47.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి గెలిచింది. తిలక్ వర్మతో పాటు జి. వివేక్ (30) బ్యాటింగ్లో రాణించాడు.
ఇతర మ్యాచ్ల స్కోర్లు
లయోలా జూనియర్ కాలేజ్: 216 (వైష్ణవ్ రెడ్డి 52, అభిషేక్ 54, వివేక్ సింగ్ 49; సాహిల్ 3/30), కాల్ పబ్లిక్ స్కూల్: 219 (సుధీంద్ర 109, ప్రణీత్ 90).
సెయింట్ ఆండ్రూస్: 210 (అభిషేక్ పరాడ్కర 35, షణ్ముఖ్ 40; వైష్ణవ్ 3/47), హెచ్పీఎస్, రామంతపూర్: 137 (పవన్ సారుు రెడ్డి 53; వశిష్ట్ 6/24).
చైతన్య జూనియర్ కాలేజ్: 263 (ప్రతీక్ రెడ్డి 62, అనిరుధ్ రాజ్ 75), లిటిల్ ఫ్లవర్ హైస్కూల్: 137 (రోనక్ 3/43).
హెచ్పీఎస్, బేగంపేట: 82 (అబ్దుల్ అద్నాన్ 3/32), వెస్లీ జూనియర్ కాలేజ్: 83/2 (గణేశ్ 36).