school cricket
-
చెలరేగిన కెవిన్ గుప్తా
సాక్షి, హైదరాబాద్: హెచ్‌పీఎస్ బౌలర్ కెవిన్ గుప్తా (7/20, 5/32) దక్కన్ బ్లూస్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (బేగంపేట్) జట్టును గెలిపించాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో ఆదివారం 58/5 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట కొనసాగించిన దక్కన్ బ్లూస్ 86 పరుగులకే కుప్పకూలింది. కెవిన్ ధాటికి ఎవరూ నిలువలేకపోయారు. తర్వాత ఫాలోఆన్ ఆడిన దక్కన్ బ్లూస్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఠాకూర్ హర్స్వర్దింగ్ (74) ఒంటరి పోరాటం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కెవిన్ 5 వికెట్లు తీశాడు. తర్వాత 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో హెచ్‌పీఎస్ 189 పరుగులు చేసింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు కొసరాజు తొలి ఇన్నింగ్స్: 338/7 (రోహన్ వార్కె 166 నాటౌట్, రాహుల్ 57), సాయి సత్య తొలి ఇన్నింగ్స్: 382/8 (శ్రీకరణ్ 103 నాటౌట్; నారాయణ 74, కృష్ణచరిత్ 57). తెలంగాణ తొలి ఇన్నింగ్స్: 145/9 డిక్లేర్డ్, డబ్ల్యూఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 175/9 డిక్లేర్డ్, తెలంగాణ రెండో ఇన్నింగ్స్: 250/6 డిక్లేర్డ్ (రాజేశ్ నాయక్ 85), డబ్ల్యూఎంసీసీ రెండో ఇన్నింగ్స్: 143/7 (యశ్వంత్ బాబు 71; సురేశ్ 3/23). -
వన్డేలో డబుల్ సెంచరీ
స్కూల్ క్రికెట్లో తిలక్‌వర్మ సంచలనం సాక్షి, హైదరాబాద్ : హెచ్‌సీఏ అండర్-16 వన్డే క్రికెట్లో హైదరాబాద్ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ (149 బంతుల్లో 201; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో క్రిసెంట్ స్కూల్ 310 పరుగుల భారీతేడాతో ప్రిస్టన్ హైస్కూల్‌పై జయభేరి మోగించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా క్రిసెంట్ మోడల్ స్కూల్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 410 పరుగుల భారీస్కోరు చేసింది. సిద్ధార్థ్ (63), వివేక్ (52) రాణించారు. తర్వాత ప్రిస్టన్ హైస్కూల్ 100 పరుగులకే కుప్పకూలింది. శశాంక్ 5, యశ్వంత్ 4 వికెట్లు తీశారు. -
సర్ఫరాజ్ సెంచరీ
సాక్షి, విశాఖపట్నం: స్కూల్ క్రికెట్లో సంచలన రికార్డులతో చెలరేగుతున్న 15 ఏళ్ల ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు భారత అండర్-19 జట్టు తరఫున కూడా సత్తా చాటాడు. ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల అండర్-19 టోర్నీలో సర్ఫరాజ్ (66 బంతుల్లో 101; 17 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీతో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై గెలిచింది. సర్ఫరాజ్‌కు తోడు స్థానిక ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (95 బంతుల్లో 94 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ ఫార్య్చూన్ (99 బంతుల్లో 90; 15 ఫోర్లు) శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో సీవీ మిలింద్, అభిమన్యు లాంబా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 39.3 ఓవర్లలోనే 6 వికెట్లకు 275 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సర్ఫరాజ్, భుయ్ ఐదో వికెట్‌కు 19.5 ఓవర్లలోనే 159 పరుగులు జోడించడం విశేషం. మరో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 147 పరుగులతో జింబాబ్వేను చిత్తు చేసింది.