విరాట్ కోహ్లి (PC: IPL/BCCI)
IPL 2023- RCB- Virat Kohli: టీ20 ఫార్మాట్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటం కూడా ముఖ్యమేనని టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మాత్రమే అక్కడి పరిస్థితులు అర్థమవుతాయని.. అందుకు తగ్గట్లే అతడు బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. కానీ.. బయట నుంచి చూసే వ్యక్తులు మాత్రం కావాలనే నెమ్మదిగా ఆడుతున్నారనుకుంటారంటూ తనను విమర్శించిన వాళ్లకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు.
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ విరాట్ కోహ్లి పవర్ ప్లేలో దూకుడుగా ఆడి 42 పరుగులు(25 బంతుల్లో) రాబట్టిన కోహ్లి.. అర్ధ శతకం పూర్తి చేయడానికి మరో 10 బంతులు తీసుకున్నాడు.
వ్యక్తిగత రికార్డుల కోసమే అంటూ
ఈ నేపథ్యంలో కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమండ్ డౌల్ కోహ్లిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లి నెమ్మదిగా ఆడాడంటూ ఆడిపోసుకున్నాడు. ఈ క్రమంలో రాబిన్ ఊతప్ప ఇంటర్వ్యూలో భాగంగా జియోసినిమాతో మాట్లాడిన కోహ్లి తాను పవర్‌ప్లే తర్వాత ఎందుకు నెమ్మదిగా ఆడానో వివరించాడు.
ఆ తర్వాతే దూకుడు ప్రదర్శించే వీలుంటుంది
‘‘యాంకర్ రోల్ అత్యంత ముఖ్యమైంది. ఈ విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కొంతమంది మాత్రం తాము ఆ పరిస్థితుల్లో అక్కడ లేము కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్లు ప్రవర్తిస్తారు. బయట నుంచి ఆటను చూసే దృక్పథం వేరుగా ఉంటుంది.
పవర్ ప్లే తర్వాత.. ‘ఏంటీ.. ఇప్పటిదాకా దూకుడు ప్రదర్శించి అకస్మాత్తుగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ డిఫెన్స్ ఆడుతున్నారు’’ అని కామెంట్ చేస్తారు. నిజానికి పవర్ ప్లేలో అత్యుత్తమ బౌలర్లే బరిలోకి దిగుతారు. తొలి రెండు ఓవర్లలో వారి బౌలింగ్‌ను అంచనా వేసి.. కుదురుకున్న తర్వాత దూకుడు ప్రదర్శించే వీలు ఉంటుంది.
గట్టి కౌంటర్ ఇచ్చాడు
ఇక ఆ తర్వాత పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటారే తప్ప కావాలని ఎవరూ నెమ్మదిగా ఆడరు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. దీంతో సైమన్ డౌల్‌కు కింగ్ పరోక్షంగా గట్టి కౌంటరే ఇచ్చాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. కీలక సమయంలో వికెట్ పడకుండా ఉండేందుకు డిఫెన్స్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేసుకోవడంలో తప్పేంటని సైమన్ డౌల్‌కు చురకలు అంటిస్తున్నారు.
చదవండి: IPL 2023: సూర్య పన్నెండుసార్లు డకౌట్ అయినా పర్లేదు.. ఫరక్ పడదు!
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
Comments
Please login to add a commentAdd a comment