
New Zealand vs India, 3rd ODI: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో నిరాశపరిచిన పంత్.. వన్డే సిరీస్‌లోనూ అదే తీరును కొనసాగించాడు. ఈ సిరీస్‌లో రెండు వన్డేలు ఆడిన పంత్.. కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో పంత్ వరుసగా విఫలమవుతన్నప్పటికీ జట్టులో ఇంకా చోటు ఇవ్వడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు.
అదే విధంగా పంత్ బదులుగా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ అత్యుత్తమ బ్యాటర్ కాదని సైమన్ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంంత్ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలి అని సైమన్ డౌల్ సూచించాడు. "గత కొంత కాలంగా వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ రికార్డు దారుణంగా ఉంది.
అతడు దాదాపు 30 మ్యాచ్‌లు ఆడితే స్ట్రైక్ రేట్ పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. సగటు మాత్రం 35 మాత్రమే ఉంది. అదే సంజూ శాంసన్ విషయానికి వస్తే.. అతడు ఆడింది కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే. కానీ సంజూ సగటు దాదాపు 60కు దగ్గరగా ఉంది. కాబట్టి అతడికి భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం భారత జట్టులో పంత్‌కు చోటు ఇవ్వాలా? సంజూకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది.
నా వరకు అయితే పంత్ స్థానంలో సంజూకు అవకాశం ఇస్తే బాగుటుంది. ఎందుకంటే వైట్‌బాల్ క్రికెట్‌లో పంత్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. కానీ టెస్టుల్లో మాత్రం పంత్ అద్భుతమైన ఆటగాడు. అంతేతప్ప వైట్‌బాల్ క్రికెట్‌లో మాత్రం పంత్ భారత అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌కు కాదు" అని సైమన్ డౌల్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: VHT 2022: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..!
IND vs NZ: 'అతడు పదేళ్లపాటు భారత్‌కు ఆడతాడు.. టీ20ల్లో కూడా అవకాశం ఇవ్వండి'