ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫఖర్ జమాన్ చూపిన క్రీడాస్పూర్తి విధానం అభిమానులను ఫిదా చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్లో అప్పటికే రెండు ఫోర్లతో జోరు మీదున్న ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నాడు. ఓవర్ ఐదో బంతిని ఆవేవ్ షార్ట్‌పిచ్ వేయగా.. బంతి బౌన్స్ అయింది.
అయితే ఫఖర్ జమాన్ షాట్ మిస్ చేసుకోగా బంతి కీపర్ కార్తిక్ చేతుల్లోకి వెళ్లింది. కానీ దినేశ్ కార్తిక్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఫఖర్ జమాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. కనీసం అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా వేచి చూడకుండా పెవిలియన బాట పట్టాడు. మహ్మద్ రిజ్వాన్ ఆలోచించమని చెప్పినా వినకుండా ఫఖర్ వెళ్లిపోయాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను స్లిక్ చేస్తు వెళ్లినట్లు స్పైక్ వచ్చింది. అప్పటికి కార్తిక్ మాత్రం ఏం తగల్లేదు అని సైగ చేయడం కనిపించింది.
Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK
— SiLItIS (@SiLItIS1) August 28, 2022
Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK
— SiLItIS (@SiLItIS1) August 28, 2022
Good Sportsman's Ship #FakharZaman#INDvPAK
— Chintala Madhusudhan Reddy (@madhuc430) August 28, 2022
చదవండి: IND Vs PAK Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment