ఆసియా కప్ 2022 సూపర్-4 దశలో ఇవాళ (సెప్టెంబర్ 4) భారత్-పాక్‌లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ హైఓల్టేజీ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ కీలక సమరానికి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు మ్యాచ్‌ల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు జట్టు కోచ్ ద్రవిడే స్వయంగా ప్రకటించాడు.
ఆవేశ్ జ్వరంతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం అతను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని, అందుకే అతను ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదని మీడియాకు వివరించాడు. అయితే హెడ్ కోచ్ మాటలను బట్టి చూస్తే పాక్‌తో కీలక సమరంలో ఆవేశ్ ఆడటం అనుమానమేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆవేశ్.. పాక్‌తో మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాకపోయినా, తదుపరి మ్యాచ్‌ల సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ఈ సందర్భంగా ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఆవేశ్ తుది జట్టులో ఉండడనడానికి పరోక్ష సంకేతంగా భావిస్తున్నారు టీమిండియా అభిమానులు.
Rahul Dravid gives an update on Avesh Khan ahead of India's clash against Pakistan.#INDvPAK #AsiaCup2022 pic.twitter.com/hB1PHLEFfk
— CricTracker (@Cricketracker) September 3, 2022
ఒకవేళ ఆవేశ్ మ్యాచ్ సమయానికి కోలుకోలేకపోతే, తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఇప్పటికే క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఆవేశ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియాలో మరో స్పెషలిస్ట్ పేసర్ లేకపోవడంతో, అశ్విన్‌తో ఆ ప్లేస్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే పాక్‌తో మ్యాచ్‌లో పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో అశ్విన్, చహల్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
గాయపడి టోర్నీకి దూరమైన ఆల్‌రౌండర్ జడేజా స్థానాన్ని దీపక్ హుడా భర్తీ చేసే అవకాశం ఉంది. వికెట్‌కీపర్‌గా ఎవరిని ఆడించాలనే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఫినిషర్ కోటాలో డీకేనే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాడు. ఇది జరిగితే పంత్ మళ్లీ పెవిలియన్‌కు పరిమితం కాక తప్పదు.
భారత్ తుది జట్టు(అంచనా)..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్
చదవండి: 'టీమిండియా 36 ఆలౌట్'.. భయ్యా మీకు అంత సీన్ లేదు!
Comments
Please login to add a commentAdd a comment