న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు.
కివీస్ బౌలర్లలో మిల్నే రెండు వికెట్లు పడగొట్టగా.. టిక్నిర్,సోధి, రవీంద్ర ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా సెంచరీతో చెలరేగిన జమాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 29న రావల్పిండి జరగనుంది.
చదవండి: MS Dhoni: 'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment